కేటీఆర్‌కు ఏమైంది? సిరిసిల్ల పర్యటనలో ఆద్యంతం తుమ్ముతూనే కనిపించిన డైనమిక్ లీడర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఆయనకు ఏమైంది. అనారోగ్యానికి గురయ్యారా? ప్రస్తుతం తెలంగాణలో నడుస్తోన్న చర్చ ఇది. ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలుమార్లు తుమ్ముతూ, దగ్గుతూ కనిపించారు. ఆ సమయంలో ముఖానికి టవల్‌ను అడ్డుపెట్టుకుంటూ దర్శనం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏపీ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ గుర్రు, విభజన చట్టానికి విరుద్ధమని కామెంట్..

సిరిసిల్ల పర్యటనలో ఆద్యంతం..
కేటీఆర్ ఆదివారం తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గల టెక్స్‌టైల్ పార్కులో నిర్మించిన సెంట్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పరిపాలనా భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ దృశ్యాలు కనిపించాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేశాయి.

టెక్స్‌టైల్ అడ్మిన్ భవనం ప్రారంభోత్సవంలో..
టెక్స్‌టైల్ పార్క్ పరిపాలనా భవన సముదాయం శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సమయంలోనూ కేటీఆర్ తుమ్ముతూ కనిపించారు. పరిపాలనా భవనాన్ని పరిశీలిస్తున్న సమయంలోనూ ఆయన పరిస్థితిలో మార్పు రాలేదు. అంతకుముందు నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన ముఖానికి టవల్‌ను అడ్డుగా పెట్టుకుని తుమ్మడం, దగ్గడం కనిపించింది. ఆయా సందర్భాల్లో టెక్స్‌టైల్స్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆయన పక్కనే ఉన్నారు.

14.50 కోట్ల రూపాయల వ్యయంతో..
సిరిసిల్ల చేతన వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇదివరకే ఓ టెక్స్‌టైల్ పార్కును నిర్మించింది. కొత్తగా అందులో ఓ పరిపాలన భవన సముదాయాన్ని అందబాటులోకి తీసుకొచ్చారు. కార్మికుల కోసం క్యాంటీన్, విశ్రాంతి గదులతో కూడిన ఈ భవన సముదాయాన్ని 14.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దీన్ని ఆదివారం కేటీఆర్ ప్రారంభించారు. టెక్స్‌టైల్ శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recommended Video

త్వరలో అపెరల్ పార్కు కూడా..
టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ పలు వరాలను కురిపించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల మహిళలకు ఉపాధి కల్పించడానికి అపెరల్ పార్కును స్థాపిస్తామని అన్నారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. పవర్‌లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications