తెలంగాణలో అండాల సేకరణ దందా.. 7 ఐవీఎఫ్ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు

తెలంగాణలో అండాల సేకరణ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 7 ఐవీఎఎఫ్ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతాన సాఫల్య చికిత్స పేరుతో మహిళలను అండాల సేకరణకు ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 31 మంది మహిళలను గుర్తించి, ఏడు ఆసుపత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలకు అధికారులు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అండాల సేకరణ అక్రమ దందాలో వైద్యులు, ఐవీఎఫ్ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మహిళలు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు పాటించని సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్, ఏఆర్టీ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు చేపట్టింది. అయితే మహిళలను ఎవరు సంప్రదించారు..? మధ్యవర్తుల పాత్ర ఏంటి..? వైద్యులు, ఐవీఎఫ్ కేంద్రాల ప్రమేయం ఎంత..? లాంటి వాటిపై లోతైన విచారణ సాగుతోంది.

Telangana IVF Center Raids Egg procurement racket busted Show cause notices issued to 7 IVF centers

ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు నవంబర్ 6న వైద్య అధికారులు దిల్లీలోని నేషనల్ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీని సందర్శించారు. తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, బ్యాంకుల పూర్తి వివరాలను కోరారు. ఈ క్రమంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అధికారులు తగిన సమాచారం అందజేస్తామని తెలిపారు. మరోవైపు ఏఆర్ టీ చట్టం-2021 ప్రకారం అండాల సేకరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగితే శిక్షార్హమని వైద్య ఆరోగ్య శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. మధ్యవర్తుల తప్పుడు హామీలు, ఆర్థిక ప్రలోభాలకు మహిళలు మోసపోవద్దని సూచనలు చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+