Kodandaram: రాహుల్ గాంధీని కలిసిన కోదండరామ్.. పొత్తుపై చర్చ..
తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పోత్తు పెట్టుకవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా రాహుల్ గాందీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. కోదండరాం రాహుల్ గాంధీని కరీంనగర్ లోని వీ పార్క్ హోటల్ లో శుక్రవారం కలిశారు. తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోదండరామ్ ను రాహుల్ గాంధీ కోరినట్లు తెలుస్తోంది.
అయితే పొత్తులో భాగంగా జన సమితి రెండు నుంచి మూడు సీట్లను ఆశిస్తోంది. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను కోదండరామ్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అటు సీపీఐ, సీఎంతో కూడా పొత్తు పెట్టుకుంది. సీపీఐ, సీపీఎంకు రెండేసి సీట్లను కేటాయించనుంది. అయితే ఎక్కడ సీటు కేటాయిస్తారో అనేది క్లారిటీ రాలేదు. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలను కోరగా.. కాంగ్రెస్ కొత్తగూడెం, చెన్నూరు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇక సీపీఎం భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు కోరగా.. ఆ పార్టీకి మిర్యాలగూడతో పాటు వెరేచోట సీటు ఇచ్చిందేకు కాంగ్రెస్ సిద్ధమైంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలతో పాటు జనసమితితో పొత్తు పెట్టుకుంది. మరోవైపు బీజేపీ, జనసేన కూడా పొత్తులో ముందుకు వెళ్తాయని తెలుస్తోంది. అయితే జనసేన ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి తెలంగాణలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే ఒంటరిగానే పోటీ చేస్తోంది. అయితే ఎంఐఎం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ఖారారు చేసింది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోగా.. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. 2014 నుంచి ఒంటరిగానే పోటీ చేస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications