ఆర్థిక సర్వే: ఎగుమతుల్లో తెలంగాణకు 5వ స్థానం, 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ జాతీయస్థాయి ఎగుమతుల్లో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడుల తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.
ఈ అయిదు రాష్ట్రాల నుంచే 70 శాతం ఎగుమతులు ఉన్నాయని సోమవారం లోకసభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే పేర్కొంది. తెలంగాణ నుంచి కమోడిటీ ఎగుమతులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.35,444 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.40,239 కోట్లు, 2017 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.19,830కోట్లు ఉన్నట్లు పేర్కొంది.

మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల నుంచే అంతర్జాతీయంగా 70% ఎగుమతులు జరుగుతుండగా.. ఇందులో మహారాష్ట్ర వాటా 22.3%, గుజరాత్ వాటా 17.2%, కర్ణాటక వాటా 12.7%, తమిళనాడు వాటా 11.5%, తెలంగాణ వాటా 6.4% ఉంది. ఏపీ వాటా కేవలం 2.8% మాత్రమే. ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో 5వ స్థానంలో, ఏపీ 9వ స్థానంలో ఉన్నాయి.
గత దశాబ్ది కాలంలో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 0.5 డిగ్రీల మేర తగ్గాయి,. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 0.25 నుంచి 0.75 డిగ్రీల దాకా పెరిగాయి. పదేళ్లలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షపాతం 50 మిల్లీ మీటర్ల వరకు పెరిగింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications