IT ఎగుమతుల్లో దూసుకెళ్తోన్న తెలంగాణ.. జిల్లాకో ఎక్స్ పోర్ట్ హబ్
ఏ రాష్ట్రంలోనైనా ఎగుమతులు అధికంగా ఉంటేనే రాష్ట్ర ఆదాయం మెరుగవుతుంది. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎగుమతుల్లో దూసుకెళ్తోంది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంచలంచెలుగా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఐటీ వ్యవస్థ వృద్థి పథంలో నడుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీ ఎగుమతుల విలువ రూ. 2.68 లక్షల కోట్లకు చేరింది. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఐటీ సెక్టార్ కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. అంతేకాక అధనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.16 లక్షల కోట్ల విలువైన పరికరాలను ఎగుమతి చేయడంతో ప్రపంచ మార్కెట్లో తెలంగాణ సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది.
జిల్లాకో ఎక్స్ పోర్ట్ హబ్..
ఎగుమతులను కొనసాగించి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో ఎక్స్ పోర్ట్ హబ్ ఏర్పాటు చేసి.. స్థానికంగా లభ్యమయ్యే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తోంది. అంతేకాక ఆర్థిక ప్రగతిలో గ్రామీణ ప్రాంతాలూ బలోపేతం అవుతాయని ఆశిస్తోంది.

ప్రస్తుతం ఐటీ సెక్టార్ లో 9.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అత్యాధునిక వ్యవస్థలైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, విజూవల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ తదితర రంగాలనూ ప్రోత్సహిస్తోంది. ఈ అత్యాధునిక రంగాల్లో ప్రస్తుతం 30,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగాలను భవిష్యత్తులో లక్ష వరకు తీసుకెళ్లాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఏఐ సీటీ ఇప్పటికే రూపుదిద్దుకుంటోంది. అలాగే తెలంగాణ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ లాంటి పలు పాలసీలనూ తీసుకొచ్చింది. అంతేకాక రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు స్టార్టప్ ఇంక్యూబేటర్లు, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తోంది.












Click it and Unblock the Notifications