Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ఇక ఎన్నికల్లో పోటీ చేయలేరు

స్థానిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక బిల్లును తెలంగాణ శాసన మండలి ఆమోదించింది. ఈ బిల్లుతో పోటీ చేసే అభ్యర్ధులకు బిగ్ షాక్ తగిలినట్లైంది. పంచాయతీరాజ్ చట్టంలోని 21 వ సెక్షన్ సవరణ బిల్లును మండలి ఆమోదం పొందిన నేపథ్యంలో ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి చాలా మంది అనర్హులు కాబోతున్నారు.

గ్రామీణ స్థాయి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి శాసన మండలి ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్-21కు చేసిన సవరణ బిల్లుకు మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు కొత్త దిశలోకి వెళ్లనున్నాయి. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న ఒక ప్రధాన నిబంధన పూర్తిగా తొలగిపోయింది.

పంచాయతీరాజ్ చట్టంలోని 21 వ సెక్షన్ సవరణ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టారు మంత్రి సీతక్క.. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. దీనికి చట్ట సవరణ చేశారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ సవరణ చేశారు. నిన్న బిల్లును అసెంబ్లీ ఆమోదించగా.. నేడు శాసనమండలిలో మంత్రి సీతక్క ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Telangana Legislative Council Clears Key Panchayat Raj Amendment Scraps Two-Child Norm for Local Elections

ఇద్దరు పిల్లలకు మించిన సంతానం ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిబంధనను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చింది. గతంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ నిబంధనను తాత్కాలికంగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయానికి చట్టబద్ధత కల్పిస్తూ, నిన్న శాసనసభ ఆమోదం పొందిన బిల్లు, ఇవాళ శాసన మండలిలో కూడా ఆమోదం పొందింది.

బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా జనాభా నియంత్రణ పాటిస్తున్నప్పటికీ, ఉత్తరాది రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ఆమె అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఫ్యామిలీ ప్లానింగ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నామని, అయితే దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో జనాభా పెరుగుదల తీవ్రంగా తగ్గే అవకాశముందని తెలిపారు. జనాభా వృద్ధిరేటు మందగిస్తే, వృద్ధుల సంఖ్య పెరిగే పరిస్థితి తలెత్తవచ్చని మంత్రి హెచ్చరించారు.

ఈ నేపథ్యంలోనే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. అవసరమైతే భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా కొత్త నిబంధనలను రూపొందించుకునే అవకాశం ఉందని కూడా ఆమె స్పష్టం చేశారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనాభా విధానంలో సమతుల్యత అవసరమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఈ నిబంధన తొలగింపుపై రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజల నుంచి కూడా అనుకూల స్పందన వచ్చిందని ఆమె గుర్తు చేశారు. అప్పట్లో జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా చాటామని తెలిపారు.

ఈ సవరణతో గ్రామీణ స్థాయి రాజకీయాల్లోకి రావాలనుకునే అనేక మంది ఆశావహులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లయింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రభావం స్పష్టంగా కనిపించనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+