తెలంగాణలో కొత్త లోక్‌సభ స్థానాలు ఇవే, కొడంగల్..కూకట్‌పల్లి సహా - రిజర్వేషన్లు ఇలా..!!

నియోజకవర్గాల పునర్విభజన పై స్పష్టత వస్తోంది. పార్లమెంట్ లో ఈ రోజు ఓటింగ్ జరగనుంది. బిల్లుల ఆమోదం తరువాత కేంద్రం డీలిమిటేషన్ కసరత్తు మరింత వేగవంతం చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ సిద్దం చేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదన మేరకు అన్ని రాష్ట్రాలతో పాటు గా తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలు 50 శాతం పెరగనున్నాయి. కొత్త స్థానాల పైన అంచనాలు దాదాపు ఖరారయ్యాయి. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న వాటిల్లోనూ కొన్ని పేర్లు మార్పుతో పాటుగా వాటి స్థానంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన పైన స్పష్టతతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తరువాత ఈ స్థానాలు 26కు చేరనున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలు చేస్తుండటంతో.. 26 స్థానాల్లో 8-9 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అదే విధంగా కొత్తగా ఏర్పాటయే నియోజకవర్గాల్లో ఎస్సీ కోటా కింద 4, ఎస్టీ కోటా కింద 2 సీట్లు కేటాయిం చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త లోక్‌సభ స్థానాల ఖరారు పైన అంచనాలు దాదాపు ఖరార య్యే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా జహీరాబాద్‌ నియోజకవర్గం స్థానంలో సంగారెడ్డి పేరుతో ఏర్పాటు కావచ్చని అంటున్నారు. పార్లమెంట్‌లో పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం ఎన్నికల సంఘంతో సంప్రదించి డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమిస్తుంది. ఆ కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి.. నివేదిక ఇచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 ఏపీలో కొత్త లోక్‌సభ స్థానాలు ఫిక్స్, లిస్టులో అమరావతి సహా ఇవే - ఈ సీట్ల రద్దు...!!
ఏపీలో కొత్త లోక్‌సభ స్థానాలు ఫిక్స్, లిస్టులో అమరావతి సహా ఇవే - ఈ సీట్ల రద్దు...!!
telangana-lok-sabha-seats-tally-will-rise-to-26-with-complete-reorganisation-of-boundaries-here-th

కొత్త నియోజకవర్గాల జాబితాలో..

తెలంగాణలో కొత్త గా ఏర్పాటు కాబోయే 9 లోక్‌సభ నియోజకవర్గాల పేర్ల పైనా స్పష్టత వస్తోంది. ఈ మేరకు కొత్త నియోజకవర్గాలుగా ఉండే వాటిల్లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. చార్మినార్ కేంద్రంగా హైదరాబాద్ లో మరో నియోజకవర్గం ఏర్పాడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే విధంగా దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్ గిరి పరిధిలోనే కూకట్‌పల్లి/శేర్‌లింగంపల్లి గా కొత్త నియోజకవర్గం రూపు సంతరించుకోనుంది. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కేంద్రంగా కొత్తగా ఎంపీ స్థానం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. నారాయణ్‌పేట/కొడంగల్‌ పేరుతో కొత్తగా లోక్ సభ స్థానం ఏర్పాటు కానుందని చెబుతున్నారు. అదే విధంగా మంచిర్యాల, కొత్తగూడెం/ భద్రాచలం, హనుమకొండ, సంగారెడ్డి, రంగారెడ్డి/పరిగి, వికారాబాద్‌, సూర్యాపేట పేరుతో కొత్తగా లోక్ సభ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నియమించే డీలిమిటేషన్ కమిటీ అధ్యయనం...నివేదిక, అభిప్రాయ సేకరణ తరువాత అధికారికంగా నియోజకవర్గాల పైన నిర్ణయం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+