కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలా?: కేంద్రంపై హరీశ్ రావు వరుస ట్వీట్లు

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)కు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపలేదని చేస్తున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనపై మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని కేంద్రంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్నారని అన్నారు.

Telangana minister harish rao condemns bjp govt comments on kaleshwaram project national status issue

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్రం వివక్షను ఎండగడుతూ హరీశ్ రావు వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తులను కూడా జతచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవం. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉంది అని హరీశ్ రావు పేర్కొన్నారు.

'కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంట్లో ప్రశ్నించగా.. నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదన్నారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్‌లోని కెన్ - బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టింది. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేడబ్ల్యుడీటీ-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చింది. న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించింది. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదు. ఇది రాజకీయ కక్ష కాదా? అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+