వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ప్ర‌జ‌లంటే అంత చుల‌క‌నా.. ఢిల్లీ వ‌స్తే అవ‌మానిస్తారా..? : పీయూష్ గోయ‌ల్‌పై హ‌రీశ్ ఫైర్‌

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసేలా కేంద్రం వ్య‌వ‌హారిస్తోంద‌ని తెలంగాణ ఆర్థిక‌, వైద్యారోగ్యశాఖ మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. రాష్ట్ర రైతాంగం సమ‌స్య‌లను వివ‌రించేందుకు మంత్రుల బృందం ఢిల్లీ వ‌స్తే వారిని అవ‌మాన‌ప‌రిచేసేలా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. పీయూష్ గోయ‌ల్ కేంద్ర మంత్రిగా కాకుండా రాజ‌కీయ నాయ‌కుడులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకొని , భేష‌రతుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని హ‌రీశ్ డిమాండ్ చేశారు.

 తెలంగాణ ప్రజలను అవమానపరుస్తారా..?

తెలంగాణ ప్రజలను అవమానపరుస్తారా..?

ధాన్యం కొనుగోలు విష‌యంపై కేంద్రంతో చ‌ర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. తెలంగాణ మంత్రులు రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులు, నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ఢిల్లీకి వచ్చారని, వారిని కేంద్రమంత్రి మీకేం పని లేదా? అంటారా అని ప్రశ్నించారు. గౌర‌వ‌మైన కేంద్ర మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు.

భేషరతుగా క్షమాపణలు చెప్పండి..

భేషరతుగా క్షమాపణలు చెప్పండి..

కేంద్ర మంత్రి వ్యాఖ్య‌లు యావ‌త్ తెలంగాణ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించేలా.. 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌న్నారు. పీయూష్ గోయ‌ల్ త‌న వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, భేషరతుగా ప్ర‌జ‌ల‌కు క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీశ్ డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలోని 70లక్షల మంది రైతుల ఆత్మగౌరవం, ప్రయోజనాలు కాపాడడమే తమకు ప్రాధాన్యమన్నారు. రాజ‌కీయం చేయ‌డ‌మే ప్రాధాన్యంగా కేంద్రం వ్య‌వ‌హారిస్తోందని విమ‌ర్శించారు.

రేపు రా రైస్ కొనుగోలు చేయ‌మ‌ని చేతులెత్తేస్తే..

రేపు రా రైస్ కొనుగోలు చేయ‌మ‌ని చేతులెత్తేస్తే..

ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరుతో తెలంగాణ‌లోని 70లక్షల రైతు కుటుంబాలు ఆగమవుతున్నాయ‌ని మంత్రి హ‌రీశ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొన్క‌టి వ‌ర‌కు బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పారు. రేపు రా రైస్ కొనుగోలు చేయ‌మ‌ని చేతులెత్తేస్తే తెలంగాణ రైతాంగం ఏం కావాల‌ని ప్ర‌శ్నించారు. కేంద్రం ఇచ్చిన 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల కోటా పూర్త‌యింది. ఆ త‌ర్వాత కొంటారా లేదా.. అని కోరేందుకు రైతుల త‌రుపున మంత్రుల బృందం ఢిల్లీకి వ‌చ్చింద‌న్నారు. కానీ మంత్రుల బృందాన్ని అవ‌మాన‌ప‌రిచేలా వ్య‌వ‌హారించార‌ని హ‌రీశ్ రావు దుయ్య‌బ‌ట్టారు.

Recommended Video

Harish Rao Innaugurates New Equipment In Osmania Hospital
 మీరు రాజకీయాలు చేస్తూ.. మాపై నిందలా..?

మీరు రాజకీయాలు చేస్తూ.. మాపై నిందలా..?


ఢిల్లీ వ‌చ్చిన మంత్రుల బృందానికి మూడు రోజుల పాటు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రుల బృందాన్ని క‌ల‌వ‌కుండా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను ఢిల్లీకి పిలిపించుకొని సమావేశమయ్యేందుకు సమయం దొరికిందా ? అన్ని మండిప‌డ్డారు. ఒక రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌రుపున వ‌చ్చిన బృందాన్ని తొలుత క‌లుస్తారా.. లేదంటే రాజ‌కీయ నేత‌ల‌ను క‌లుస్తారా..? అని ప్ర‌శ్నించారు. మీరు రాజ‌కీయాలు చేస్తూ మాపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని హ‌రీశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

English summary
TS Minister Harish Rao Serious warning to Union minister Piyush Goyal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X