తెలంగాణ ఆశా వర్కర్లకు మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్

హైదరాబాద్: రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. 'ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.

అందుకు తగ్గటుగా వారి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వేతనాల పెరుగుదలకు, సకాలంలో వేతనాలు పొందేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు.. ధర్నాలు, నిరసనలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటి అవసరం లేదన్నారు మంత్రి హరీశ్ రావు.

 Harish Rao

తెలంగాణ ఏర్పడ్డాక మూడు సార్లు వేతనాలు పెంచి, ప్రస్తుతం రూ. 9750 ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, ఇతర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతిలను మంత్రి ఆదేశించారు.

 Harish Rao

14న నిర్వహించనున్న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవంలో ప్రతి ఒకరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి కోరారు. వైద్యారోగ్యశాఖలో సమిష్టి కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమం విభాగం కమిషనర్‌ శ్వేత మహంతి, డీపీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.మంత్రి హరీశ్ రావు నిర్ణయంపై ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+