హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది. అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్-ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం, సౌకర్యాలు, వేగంగా నిర్మాణం పూర్తి చేసిన విధానం సంస్థ బృందాన్ని ఆకర్షించాయి. ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

 Telangana minister ktr got invitation from ASCE-EWRI to speech on projects in telangana

ఈ క్రమంలో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్ పార్సన్స్ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్ నెవడలో జరగనున్న సదస్సులో పాల్గొని ప్రసంగించాలని కేటీఆర్‌ను కోరారు.

తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంబించిన విధానాలు, రాష్ట్రం సస్యశ్యామలంగా మారిన క్రమాన్ని వివరించాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతూ ఆ సంస్థ పంపిన లేఖలో పేర్కొంది. కాగా, ఇప్పటికే మంత్రి కేటీఆర్‌కు పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనాలని ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే.

English summary
Telangana minister ktr got invitation from ASCE-EWRI to speech on projects in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X