గల్లీలో కాదు.. దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయ్.. బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన నిరుద్యోగ దీక్షను తప్పుపట్టారు. కమలం నేతల దీక్షలను , కపట ప్రేను చూసి అవకాశవాదమే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత తమ ప్రభుత్వం లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎన్నికోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలంటూ బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

యువతను నట్టేట ముంచింది బీజేపీనే..
దేశంలో యువతను నమ్మించి నట్టేట ముంచిన చరిత్ర బీజేపీదేనని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మీ చేత గాని పాలనతో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత పెరిగిందని దుయ్యబట్టారు. తెలంగాణలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రానికి రూ. 2 లక్షల 20 వేల కోట్ల పెట్టబుడులు తీసుకువచ్చామన్నారు. తద్వారా సుమారు 16 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంలో తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.

గల్లీలో కాదు ఢిల్లీలో దీక్ష చేయ్..
నిరుద్యోగ యువతపై బండికి సంజయ్‌కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇందిరా పార్కు వద్ద కాదు.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని సవాల్ విసిరారు. సిగ్గుమాలిన దీక్ష చేస్తూ యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. పెండింగ్‌లో పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని గల్లాపట్టుకుని నిలదీసే దమ్ముందా అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్రం పరిధిలో ఉన్న మొత్తం 15లక్షల ఖాళీలను ఇంకా ఎందుకు భర్తీ చేయలేదో ప్రధాని మోదీని నిలదీయాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణపై కేంద్రం కక్ష..
తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. పారిశ్రామిక ప్రగతి కోసం ఇచ్చిన ఒక్క ప్రోత్సాహం ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. రాష్ట్రానికి పెట్టుడులు తరలివస్తుంటే పారిశ్రామిక కారిడార్లు ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నా.. కావాలని కొర్రీలు పెట్టింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాదా.. అని మండిపడ్డారు. హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని, మీ చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు కేటీఆర్.

రాజకీయ నిరుద్యోగంతో దీక్ష
రాజకీయ లబ్దికోసమే ఇంధిరాపార్కులో బండి సంజయ్ దీక్ష చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. నిరుద్యోగులపై కపట ప్రేమను కురిపిస్తూ రాజకీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్న బీజేపీ నేతలు అత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోసుకోవాలన్నారు. రాష్ట్ర యువతకు, నిరుద్యోగులకు ఏ సాయమూ చేయలేని మీ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారనంటూ ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాల ఉచ్చులో యవత పడొద్దు
ప్రతిపక్షాల చేసే కపటపు ఉచ్చులో తెలంగాణ యువత పడొద్దన్నారు మంత్రి కేటీఆర్. యువత అకాంక్షలకు అనుగుణగా తమ ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షలాది మందికి ఉద్యోగ కల్పన జరిగింది. మున్ముందు కూడా తమ ప్రయత్నం యథావిధిగా కొనసాగుతుందని యువతకు విజ్ఞప్తి చేశారు . రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష నేతలు చేసే అసత్యాలను నమ్మొద్దన్నారు. విజ్ఞతతో యువత అలోచించాలని కేటీఆర్ కోరారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications