మోదీ రైతు విరోధి .. నడ్డా, బండికి సిగ్గుందా.. ఎర్రగడ్డకు పంపించాలా.. కేటీఆర్ ఫైర్

భారతీయ జనతా పార్టీపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్దారు. దేశంలో దిక్కుమాలిన పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పంజాబ్ నుంచి వెనక్కి పంపించి తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. రైతులు ప్రధానిని అడ్డుకున్నారంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చిల్లరగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

జేపీ నడ్డాకు సిగ్గుందా..

జేపీ నడ్డాకు సిగ్గుందా..

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే పెద్దమనిషి అనుకున్నాం.. కానీ చిల్లరగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ పై ఇష్టాను రీతిలో మాట్లాడుతున్నరని దుయ్యబట్టారు. జేపీ నడ్డాకు, బండి సంజయ్‌కు పెద్ద తేడాలేదని విమర్శిచారు. తెలంగాణలో కుటుంబ పాలన గురించి విమర్శులు చేస్తున్న నడ్డా .. బీజేపీలో ఉన్న కుటుంబ పాలన గురించి ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు పాలించకూడదా? అని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ మంత్రిగా లేరా అని కేటీఆర్ ప్రశ్నించారు.

నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా లేదా.

నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా లేదా.

.
ప్రజాస్వామ్యం గురించే మాట్లాడేందుకు జేపీ నడ్డాకు సిగ్గుందా అని మండిపడ్డారు కేటీఆర్. నడ్డాను ఎర్రగడ్డకు పంపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధును కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేకుండా పోయిందని విమర్శించారు.

 గుండు పోతే గుండు వస్తుందా

గుండు పోతే గుండు వస్తుందా


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కరీంనగర్‌లో అరెస్ట్ సందర్భంగా బండి తన గుండు తీసి గోడకు కొట్టుకున్నారు విమ‌ర్శించారు. మరి బండిపోతే బండి వస్తుంది.. కానీ గుండు పోతే గుండు వస్తుందా అని ఎద్దేవా చేశారు. రైతులను , ఉద్యోగులను రెచ్చగొడుతున్నారిన విమర్శించారు. బీజేపీని చీల్చి చెండాడతామని హెచ్చరించారు. ఏం చేస్తారో తేల్చుకుంటామ‌ని మండిప‌డ్డారు.

Recommended Video

    KTR Launches APJ Abdul Kalam Flyover At Owaisi-Midhani Junction | Oneindia Telugu
    రైతు విరోధి మోదీ

    రైతు విరోధి మోదీ

    ప్రధాని మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమి లేదని కేటీఆర్ విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేస్తూ హిందూ , ముస్లీంల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రైతు విరోధి మోదీ అన్నారు. అందుకే పంజాబ్‌లో రైతులు మోదీని తిప్పిపంపించారని విమర్శించారు. దేశంలో తొలిసారిగా ఇలా రైతులు ఒక ప్రధానిని అడ్డుకోవడమన్నారు. ప్రధానినే రైతులు అడ్డుకున్నారంటే సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతోందన్నారు. మోదీ పాలన సామాన్యుడికి శోకం .. కార్పొరేటర్లకు కనకాభిషేకంగా ఉందని విమర్శించారు

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+