దావోస్‌కు కేటీఆర్- షెడ్యూల్ ఇదే: సందడి షురూ
బెర్న్: ప్రపంచ ఆర్థిక సదస్సు సందడి మొదలు కాబోతోంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు దీన్ని నిర్వహించడానికి వరల్డ్ ఎకమిక్ ఫోరమ్ సన్నాహాలు పూర్తి చేస్తోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించబోయే ఈ సదస్సు షెడ్యూల్ ఇదివరకే వెల్లడైంది. ఇది 53వ సమావేశం. దావోస్ లోని స్విస్ స్కీ రిసార్ట్ టౌన్ లో అయిదు రోజుల పాటు ఈ వార్షిక సమావేశం ఏర్పాటు కానుంది. సుస్థిరాభివృద్ధి సాధించడం, ఆహార సంక్షోభాన్ని నివారించడం, పెట్టుబడులు.. వంటి అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి.
ఈ సంవత్సరం దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ భేటీకి ప్రపంచవ్యాప్తంగా 700 మల్టీనేషనల్ కంపెనీకి చెందిన 1,500 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆర్థికం, సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు.

జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ ఎం రాంఫోసా, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, స్విస్ ప్రెసిడెంట్ అలైన్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి మారిన్ ఇందులో పాల్గొననున్నారు.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్, అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఒకోంజో-ఇవెలా, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ప్రపంచ ఆర్థిక సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రేయేసస్ దీనికి హాజరు కానున్నారు.

భారత్ నుంచి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మన్‌సుఖ్ మాండవీయతో పాటు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, ఏక్ నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మై.. దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరు కానున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరు కానున్నారు.
ఈ నెల 15 లేదా 16వ తేదీన ఆయన స్విట్జర్లాండ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఎన్ చంద్రశేఖరన్, కుమార్ మంగళం బిర్లా, ఆదార్ పూనావాలా, సజ్జన్ జిందాల్, నాదిర్ గోద్రెజ్, రాజన్ మిట్టల్, సునీల్ మిట్టల్, సంజీవ్ బజాజ్ వంటి వందమందికి ఈ భేటీకి హాజరు కానున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications