కన్యాదానం చేసిన మంత్రి.. అనాధ అమ్మాయికి గ్రాండ్‌గా వివాహం.. మల్లారెడ్డిపై ప్రశంసల వెల్లువ

హైదరాబాద్ : మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి మాత్రం మానవత్వం చాటుకుని ఔరా అనిపించారు. ఆయన చేసిన మంచిపనికి ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు ప్రముఖులు, ప్రజలు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ అమ్మాయి వివాహాన్ని మల్లారెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు ఆశ్రమంలో నివాసముంటున్న పుష్పను.. విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకకు అన్ని తామై మంత్రి దంపతులు దగ్గరుండి ఘనంగా వివాహం నిర్వహించారు.

Recommended Video

    చిన్నారి శ్రీత కుటుంబాన్ని పరామర్శించిన బీసీ సంఘం నాయకులు

    బహుదూర్‌పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పెరిగిన పుష్పను.. విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ వివాహానికి యువతి తల్లిదండ్రుల స్థానంలో మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. అమ్మాయి పేరున 2 లక్షల 35 వేల రూపాయలు ఫిక్స్‌ డిపాజిట్ చేసి దానికి సంబంధించిన బాండ్ పేపర్లు అందించారు.

    telangana minister mallareddy kanyadanam for poor bride

    అంతేకాదు ఖర్చుల నిమిత్తం 25వేల రూపాయల నగదును నూతన దంపతులకు మంత్రి అందజేశారు. వివాహానికి వచ్చిన పెద్దలకు, వివాహ ఖర్చు మొత్తం ఇచ్చి, కన్యాదానం చేసిన మంత్రి మల్లారెడ్డి దంపతులకు ఆశ్రమ నిర్వహకులు, పెండ్లి కూతురు పుష్ప, పెండ్లి కుమారుడు కిశోర్ కృతజ్ఞతలు తెలిపారు.

    వివాహ ఖర్చులు మొదలు అన్నీ తామై వ్యవహరించారు మల్లా రెడ్డి దంపతులు. అనాధ అమ్మాయికి తల్లి తండ్రుల స్థానంలో మంత్రి దంపతులు దగ్గరుండి వివాహం జరిపించడాన్ని పలువురు ప్రముఖులు మల్లారెడ్డిని మెచ్చుకుంటున్నారు. మంత్రి చేసిన మంచి పనికి ప్రశంసల జల్లు కురుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+