"వారంలో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా"

తెలంగాణ రాష్ట్రంలోని రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీస్తున్నారు. పీఏసీఎస్ ల వద్ద భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. క్యూలైన్లలో ఆధార్ కార్డులు, పాదరక్షలు పెట్టి గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. దీంతో పలు రైతు కేంద్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు మోహరిస్తున్నారు. అటు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ నుంచి ఇటు ఖమ్మం, నల్గొండ.. చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సమస్యను అధిగమించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రంపై ఒత్తిడితో ఈ వారం రోజుల్లో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండ్‌ కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

" రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది. దీన్ని కప్పిపుచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. వాస్తవాలు దాచిపెట్టి.. యూరియా దారి మళ్లిందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ఏడాదిన్నర కాలంలో యూరియా కొరత ఇంతగా లేదు. ఈ సారి కేంద్రం కేటాయింపుల మేరకు రాష్ట్రానికి ఇవ్వలేదు. అందువల్లే సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకుని హుందాగా వ్యవహరించాలి. కేంద్ర మంత్రిగా యూరియాను సరఫరా చేయించడం ఆయన బాధ్యత" అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Telangana Minister Tummala Nageswara Rao Acts to Address Urea Shortage with 35 000 MT Supply

ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం.. తెలంగాణలో 2025 సీజన్‌ లో 1.32 కోట్ల ఎకరాల్లో వరి, పత్తి పంటలు అధికంగా సాగవుతున్నాయి. ఈ పంటలకు యూరియా అవసరం. అలాగే తెలంగాణకు ఈ వానాకాలం సీజన్ లో 9. 80 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇక ఆగస్టు నెలకు తెలంగాణ రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు జరపగా.. సరఫరా అయినది మాత్రం 0.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+