తెలంగాణ రైతన్నల ఆదాయం డబుల్ .. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణలో రెతులు, మహిళల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎన్నికల్లో రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకాన్ని ప్రారంభిస్తోంది రేవంత్ సర్కార్. ఇటీవల పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా పథకం నిధుల పంపిణీని విజయవంతంగా పూర్తిచేసింది. తాజాగా రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలన్న ఉద్దేశంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని రైతన్నలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రైతు భరోసా నిధులను రికార్డు స్థాయిలో మొత్తం 69.39 లక్షల మంది రైతులకు గాను రూ.8,744.13 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది రేవంత్ సర్కార్. తాజాగా రైతులు మరింత అభివృద్ధి చెందేలా వారి ఆదాయం మరింత పెరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు గతంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ ను నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించామన్నారు. పామాయిల్ సాగును రైతులు అధిక మొత్తంలో సాగు చేసేందుకు పోత్సాహం కల్పిస్తామన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఇందిరాశక్తి సంబరాల సభలో ఆ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులతో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇళ్లు, రేషన్ కార్డులు మహిళల పేరు మీదే అందిస్తున్నామని వివరించారు.
ఆయిల్ పామ్ సాగు విషయంలో రైతులకు అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. నవంబర్ నాటికి పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని.. ఆ దిశగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రిఫైనరీ పనులు కూడా స్థానికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాక రైతులకు రుణమాఫీ కింద ఒకేసారి రూ. 21 వేల కోట్లను ఖాతాల్లో జమ చేశామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

అంతేకాక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు సాయం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కౌలు రైతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో తెలిపిన విషయం తెలిసిందే.
అలాగే రైతుల ఆదాయం పెరిగే విధంగా రాష్ట్రంలో ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధానం ద్వారా చెట్లు, వ్యవసాయ పంటలను ఒకే భూమిలో పెంచుతారు. ఈ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్రంలోని వ్యవసాయ బోర్లకూ సోలార్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయనుంది. దీంతో ఆ కరెంట్ ను బోరుకు వినియోగించుకోవచ్చు. మిగిలిన సోలార్ కరెంట్ గ్రిడ్ కు సరఫరా అవుతుంది. సోలార్ విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినందుకు రైతుకు ఒక యూనిట్ కు రూ. 3.13 చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లిస్తాయి. దీంతో రైతులు పంటల ద్వారానే కాకుండా అదనంగా కూడా సంపాదించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.












Click it and Unblock the Notifications