దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా మంత్రి.. పరిస్థితి ఇలా!

ఇరాన్ ఇజ్రాయిల్ వార్ కొనసాగుతుంది. భీకర రూపం దాల్చిన ఈ వార్ ప్రభావం దుబాయ్ పైన పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడుల నేపధ్యంలో ఒక్కసారిగా ఉలికిపాటు చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న తెలుగువారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో తెలంగాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడ చిక్కుకుపోయారు.

దుబాయ్ లో ఇరుక్కుపోయిన మంత్రి తుమ్మల

ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఆయన దుబాయ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడి పరిణామాల నేపథ్యంలో ఆయన తిరిగి భారతదేశానికి రావడం ఆలస్యమైంది.దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడుల కారణంగా భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ ఘటనల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నడిచే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.

Telangana minister tummala nageswararao stuck in Dubai This is the situation in dubai with iran israel war

విమానాల రాకపోకలు నిలిచిపోవటంతో అక్కడే ఉన్న మంత్రి

ఈ విషయాన్ని అక్కడి అధికారులు ప్రకటించారు. భద్రతా సమీక్ష పూర్తయ్యేంత వరకు, అలాగే విమానాశ్రయ కార్యకలాపాలకు పూర్తి క్లియరెన్స్ లభించేంత వరకు విమానాల రాకపోకలు నిలిపివేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

విమాన సర్వీసులు పునరుద్ధరణ కాగానే ఇండియాకు మంత్రి

ఆయన సురక్షితంగా ఉన్నారని, స్థానిక అధికారులతో మరియు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన అనుచరులు తెలిపారు. విమాన సర్వీసులు పునరుద్ధరించగానే తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తారని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై తెలంగాణలో రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

కుటుంబ సభ్యుడి అనారోగ్యం కోసం చికిత్సకు వెళ్ళిన మంత్రి

అయితే మంత్రి కుటుంబ సభ్యుడి అనారోగ్యం కోసం దుబాయ్ వెళ్ళారంటే ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చిందో అన్న చర్చ జరుగుతుంది. అయితే ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఆయన దుబాయ్‌లోనే ఉండి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన తన పాలనా పరమైన కార్యాకలాపాలు అన్నీ ఫోన్ ద్వారానే సాగిస్తున్నారు.

Telangana minister tummala nageswararao stuck in Dubai This is the situation in dubai with iran israel war

సురక్షితంగానే ఉన్నానని చెప్పిన మంత్రి

అయితే దుబాయ్ లో విమానాశ్రయానికి సంబంధించి భద్రతా తనిఖీలు పూర్తయ్యాకే అంతర్జాతీయ విమానాలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. క్లియరెన్స్ లభించిన వెంటనే మంత్రి భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను సురక్షితంగానే ఉన్నానని చెప్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+