కొప్పులకు స్థానమని కెసిఆర్: మంత్రుల్లో గుబులు, ఎవరికి ఉద్వాసన?
హైదరాబాద్: చీఫ్ విప్, కరీంనగర్ జిల్లా ధర్మపురి శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన మంత్రుల్లో గుబులు రేపుతోంది. ఎవరికి ఉద్వాసన జరుగుతుందనే చర్చ మంత్రుల్లో సాగుతోంది. ఇంతకు ముందు కూడా కెసిఆర్ ఇటువంటి ప్రకటనే ఒకటి చేశారు.
తెలంగాణ సాంస్క్తృతి సారథి చైర్మన్, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌కు మంత్రి పదవి ఇస్తానని ఇంతకు ముందు ఓసారి ఆయన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎవరినైనా కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకోవాలని అనుకుంటే ఎవరో ఒకరికి ఉద్వాసన తప్పని పరిస్థితి. రాజ్యాంగ నిబంధనల మేరకు కెసిఆర్ మంత్రివర్గంలో 18 మంది ఉండాలి. ఇప్పటికే ఈ కోటా పూర్తయింది.
దాంతో ఎవరికి ఉద్వాసన జరుగుతుందో తెలియని అయమోయ పరిస్థితి నెలకొని ఉంది. ఆరుగురు శాసనసభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులకు నియమించి, వారికి కేబినెట్ హోదా కల్పించారు. అయితే, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని కోర్టు కొట్టేసింది.

మంత్రివర్గంలో మహిళలు లేకపోవడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నాయి. కాగా,త ముఖ్యమంత్రి ప్రతి మంత్రి పనితీరును సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమీక్షలో సరిగా పనిచేయని, ప్రజాదరణ సాధించుకోలేని మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మంత్రుల పనితీరుపై కెసిఆర్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రుల వెన్నుల్లో వణుకుపుడుతోంది. రాజయ్య తరఫున మంత్రి పదవులు కోల్పోయేవారు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications