పురపోరులో నేడే క్లైమాక్స్: బరిలో నిలిచేదెవరు? తప్పుకునేదెవరు?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు(ఫిబ్రవరి 3) నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాష్ట్ర స్థాయి ఎన్నికల తర్వాత వస్తున్న అతిపెద్ద పోరు కావడం విశేషం. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు రెబల్ అభ్యర్థుల బెడద తీవ్రంగా ఉంది.

మధ్యాహ్నం 3 గంటలే డెడ్‌లైన్
అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. రాజకీయ పార్టీల తరఫున అధికారికంగా పోటీ చేసే అభ్యర్థులు తమ బీ-ఫారాన్ని కూడా ఈ గడువులోపే రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయానికి బీ-ఫారం అందకపోతే వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు.

Telangana Municipal Elections 2026 Last Day for Nomination Withdrawal Final List Today Full Details

అభ్యర్థుల ఎంపికలో ఏఐ టెక్నాలజీ
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సారి ఎన్నికల నిర్వహణలో వినూత్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమంలో అమర్చడంతో పాటు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో ఎలాంటి లోపాలు జరగకుండా సరిచూస్తుంది. ఐఏఎస్ అధికారి మకరందు నేతృత్వంలో రూపొందించిన సెక్యూర్(Secure) యాప్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు డేటాను పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 29,742 నామినేషన్లు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నామినేషన్ల పరిస్థితి ఇలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్రంగా 3,748 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సరైన వివరాలు లేకపోవడంతో 2,911 నామినేషన్లు తిరస్కరించగా.. 19, 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎంతమంది ఉపసంహరించుకుంటారనేది కీలకంగా మారింది.

తదుపరి ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల ప్రక్రియ ఈ విధంగా సాగనుంది. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపుతో పాటు అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణం స్వీకారం జరగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది.

ఎక్స్ అఫీషియో ఓటర్ల పాత్ర
మేయర్, ఛైర్మన్ల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు 'ఎక్స్‌అఫీషియో' ఓటు హక్కు ఉంటుంది. వీరు ఫిబ్రవరి 11 నుంచి 14 మధ్య తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్న మున్సిపాలిటీని ఎంచుకుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే, అంటే ఈరోజు సాయంత్రం లోపు ప్రతి వార్డులో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఆయా కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ అభ్యర్థుల గెలుపునకు ఆయా పార్టీల నాయకులు శాయశక్తులా పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+