టిడిపి ఆంధ్రకే పరిమితం, తెలంగాణకు మరో పార్టీ: పిఎ సంగ్మా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఓ కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత, లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైందని, బిజెపి పుంజుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

తెరాస ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం కనిపిస్తోందని సంగ్మా అభిప్రాయపడ్డారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన హైదరాబదా్ వచ్చారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యెన్నం శ్రీనివాసరెడ్డి, చెరకు సుధాకర్‌తో కలిసి ఆయన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

తెలంగాణలో రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు నేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications