వారం రోజే గడువు!: నేటి నుంచి కొత్త రూల్స్

తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి రవాణా శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. షోరూమ్‌లో బండి కొన్న తర్వాత నెలల తరబడి శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబర్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చేశాయి.

గతంలో వాహనం కొన్నప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) షోరూమ్‌లో జరిగినా, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాహనదారుల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. అయితే, కొన్నిచోట్ల డీలర్ల నిర్లక్ష్యం వల్ల మూడు, నాలుగు వారాలైనా రిజిస్ట్రేషన్ పూర్తి కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఫిజికల్ ఫారాలను (Form-20) డీలర్లు సకాలంలో ఆర్టీఓ కార్యాలయాలకు చేరవేయకపోవడమేనని అధికారులు గుర్తించారు.

Telangana New Vehicle Registration Rules 2026 Mandatory Online Process and 7-Day Deadline for Dealers Now

పూర్తిగా ఆన్‌లైన్..

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం, వాహనదారుడి నుంచి సేకరించిన సంతకాలు, ఫైనాన్షియర్ వివరాలు మరియు ఫారం-20ని డీలర్లు స్కాన్ చేసి ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. మార్చి 13 తర్వాత ఎలాంటి భౌతిక పత్రాలను (Physical Documents) రవాణా శాఖ కార్యాలయాల్లో స్వీకరించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. దీనివల్ల కాగితాల కోసం వేచి చూసే పని తప్పుతుంది.

రిజిస్ట్రేషన్ జరిగిన ఏడు రోజుల్లోపు..

డీలర్లకు కఠినమైన డెడ్‌లైన్‌లను కూడా రవాణా శాఖ విధించింది. వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ జరిగిన ఏడు రోజుల్లోపు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజులు దాటినా పెండింగ్‌లో ఉంచితే, సదరు డీలర్ల లాగిన్ ఐడీని రవాణా శాఖ బ్లాక్ చేస్తుంది. అంటే, వారు ఆ సమస్యను పరిష్కరించే వరకు కొత్త వాహనాలను విక్రయించడానికి వీలుండదు. అలాగే, రిజిస్ట్రేషన్ కోసం తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే డీలర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

డీలర్లకు షాక్..

మరోవైపు, అధికారుల జాప్యానికి కూడా చెక్ పెట్టారు. డీలర్లు ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను కేవలం రెండు పనిదినాల్లో పరిశీలించి ఆమోదించాలి. ఒకవేళ ఏవైనా లోపాలుంటే వెంటనే సవరణల కోసం వెనక్కి పంపాలి తప్ప, అకారణంగా దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకూడదని కమిషనర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సరికొత్త ఆన్‌లైన్ విధానం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, వాహనదారులకు వేగంగా రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించే అవకాశం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+