తెలంగాణలో 90 వేలను దాటిన కరోనా కేసులు: 23 వేలమందికి పైగా చికిత్స: రికవరీ రేటులో

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల తీవ్రత ఎప్పట్లాగే కొనసాగుతోంది. మరణాల సంఖ్యా పెరుగుతోంది. ప్రతిరోజూ రెండువేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సగటున 10 మంది వరకు మరణిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్క్‌ను అధిగమించింది. రికవరీ రేటు ఆశించిన స్థాయిలో నమోదవుతోంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 66 వేలను దాటుకుంది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1863 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 1912 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లుక వెళ్లారు. దీనితో ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 90,259కి చేరుకుంది. ఇందులో 66,196 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 684కు పెరిగింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 23,379గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 16,221 మంది చికిత్స ఉన్నారు.

ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్‌ను విడుదల చేసింది.

Telangana: Newly 1863 Covid19 positive cases and 10 deaths reported in last 24 hours

తెలుగులోనూ బులెటిన్‌ను విడుదల చేసింది వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ. పూర్తి వివరాలను ఈ బులెటిన్‌లో పొందుపరిచారు. అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో తెలుగులో వివరాలను అందించబోతున్నామని అధికారులు తెలిపారు. తాజా వివరాల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. ఎప్పట్లాగే భారీ సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 394 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

జిల్లాలవారీగా 24 గంటల్లో ఆదిలాబాద్-18, భద్రాద్రి కొత్తగూడెం-36, జగిత్యాల-61, జనగామ-34, జయశంకర్ భూపాలపల్లి-12, జోగుళాంబ గద్వాల-58, కామారెడ్డి-31, కరీంనగర్-104, ఖమ్మం-61, కొమరంభీమ్ ఆసిఫాబాద్-12, మహబూబ్ నగర్-18, మహబూబాబాద్-14, మంచిర్యాల-7, మెదక్-36, మేడ్చల్ మల్కాజ్‌గిరి-175, ములుగు-13, నాగర్ కర్నూలు-24, నల్లగొండ-49, నారాయణపేట్-5, నిర్మల్-28, నిజామాబాద్-39, పెద్దపల్లి-40, రాజన్న సిరిసిల్ల- 90, రంగారెడ్డి-131, సంగారెడ్డి-81, సిద్ధిపేట్-60, సూర్యాపేట్-33, వికారాబాాద్-16, వనపర్తి-26, వరంగల్ రూరల్-41, వరంగల్ అర్బన్-101, యాదగిరి భువనగిరి-15 కేసులు నమోదు అయ్యాయి.

Telangana: Newly 1863 Covid19 positive cases and 10 deaths reported in last 24 hours

24 గంటల వ్యవధిలో మొత్తం 21,239 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 7,32,435కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 19,728 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+