Telangana Police: ఫోన్ల రికవరీలో మొదటి స్థానంలో తెలంగాణ పోలీసులు..
దేశంలో ఫోన్ల వాడకం భారీగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు అయితే భారీగా పెరిగాయి. దాదాపు ప్రతి ముగ్గురిలో ఒక్కరి ఫోన్ ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఫోన్ల వాడం ఏ స్థాయిలో ఉందో వాటి దొంగతనం కూడా అదే స్థాయిలో ఉంది. వార్త చదువుతున్న వారిలో చాలా మంది తమ ఫోన్లు పోగొట్టుకుని ఉంటారు. అయితే పోయిన ఫోన్లు దొరగడం చాలా కష్టం. ఫోన్ పోతే దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అంత ఫలితం ఉండదని చాలా భావిస్తారు.
కానీ మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లలో 33.71 శాతం రికవరీ సాధించినట్లు చెబుతున్నారు. గత ఎనిమిది నెలల వ్యవధిలో 15,024 సెల్‌ఫోన్స్‌ను ట్రేస్ చేసి బాధితులకు అందించినట్లు పేర్కొంటున్నారు. సెంట్రల్ ఎక్వీప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా రాష్ట్ర సీఐడీ పోలీసులు నిర్వహిస్తున్న మొబైల్స్ ట్రేసింగ్ వివరాలను తాజాగా ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల లో సీఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ప్రజలకు అందుబాటులు ఉచ్చినట్లు తెలిపారు. జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ ఆఫీసర్లన కూడా నియమించినట్ల పేర్కొన్నారు. సీఐడీ ఆఫీస్ లో ని మెయిన్ సర్వర్ తో సీఈఐఆర్ పార్టల్ ను ఆపరేట్ చేస్తున్నట్లు వివరించారు. ఫలితంగా పోయిన ఫోన్ల రివకరీ చేస్తున్నారు. రికవరీ చేసిన ఫోన్ల తిరిగి యజమానులకు అందిస్తున్నారు. అయితే కొన్ని ఫోన్ల్ మాత్రం రికవరీ చేయడం కుదరడం లేదు.
ఫోన్లు దొంగలించిన వారు ఆ ఫోన్లు ట్రేస్ కాకుండా చేస్తున్నారు. అయినప్పటికీ ఫోన్లను పోలీసులు పనిచేయకుండా బ్లాక్ చేస్తున్నారు. ఏప్రిల్20వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకు 43,935 సెల్‌ఫోన్స్‌ను గుర్తించారు. వీటిలో 15,024 ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1,06,132 ఫోన్లను బ్లాక్ చేసినట్లు వివించారు. ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించారు. ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్, మీ సేవా సెంటర్స్, https://www.ceir.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications