'హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి'

తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలో సంఘ విద్రోహశక్తులు జొరబడే అవకాశం ఉందని, అందుకే అనుమతివ్వలేదని పోలీసులు మంగళవారం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలో సంఘ విద్రోహశక్తులు జొరబడే అవకాశం ఉందని, అందుకే అనుమతివ్వలేదని పోలీసులు మంగళవారం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవీస్ విలేకరులతో మాట్లాడారు. రేపు (బుధవారం) జేఏసీ నిర్వహించే ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ర్యాలీలో పాల్గొంటే విద్యార్థులపై కేసులు పెడతామని హెచ్చరించారు.

kodandaram

విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని చెప్పారు. ఇందిరా పార్క్ వద్దకు ఎవరికీ అనుమతి లేదని చెప్పారు. అనుమతి లేని ర్యాలీలో ఎవరైనా పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

జిల్లాల నుంచి విద్యార్థులు, జేఏసీ నాయకులు హైదరాబాద్‌కు రాకూడదని సూచించారు. నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ వద్ద నిషేదాజ్ఞలు అమలులో ఉన్నట్లు చెప్పారు.

విద్యార్థులు ర్యాలీలో పాల్గొనకుండా విద్యా సంస్థలు కట్టడి చేయాలన్నారు. ర్యాలీకి అనుమతి లేని విషయాన్ని అన్ని జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే తెలిపామన్నారు.

అనుమతి లేదు: డిజిపి

బుధవారం నాడి జేఏసీ సభకు అనుమతి లేదని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. జిల్లాల నుంచి ఎవరూ రావొద్దని సూచించారు. అసాంఘిక శక్తులు చొరబడే అవకాశముందనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అనుమతి నిరాకరించామన్నారు. విద్యార్థులను నిరుద్యోగ ర్యాలీకి పంపించవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+