తన ఓటు ఎవరికి పడిందో వివరించిన నటి పూనమ్ కౌర్
Poonam Kaur: తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. ఇంకొన్ని గంటల్లో దీనికి తెరపడనుంది. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావట్లేదు. మధ్యాహ్నం 2 గంటల వరకు 41 శాతం మేర మాత్రమే పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేసరికి 60 శాతానికి చేరుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్నిపల్ కార్పొరేషన్ పరిధిలో తొలి రెండు గంటల పాటు ఫర్వాలేదనిపించేలా సాగింది పోలింగ్. ప్రత్యేకించి- వీవీఐపీ జోన్‌గా గుర్తింపు పొందిన జూబ్లీహిల్స్ సహా, ఖైరతాబాద్, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే కొన్ని డివిజన్లల్లో పోలింగ్ ముమ్మరం సాగింది.

ఈ నియోజకవర్గాల పరిధిలో నివసించే టాలీవుడ్ పెద్దలు ఈ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అక్కినేని నాగార్జున, అమల, అక్కినేని నాగచైతన్య, అల్లు అర్జున్, రవితేజ, రామ్ పోతినేని, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నాని, జగపతి బాబు, మంచు మనోజ్..ఓటు వేశారు.
ప్రముఖ నటి పూనమ్ కౌర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని బ్రైట్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఈ ఉదయమే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. క్యూ లైన్‌లో నిల్చుని మరీ ఓటు వేశారు. తాను ఓటు వేసినట్లు సెల్ఫీ ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
తాను ఎవరికి ఓటు వేశాననేది నర్మగర్భంగా వెల్లడించారు. మహిళా సాధికారత, సమానత్వం కోసం కృషి చేసే వారికే తాను ఓటు వేశానని తెలిపారు. ఒక అపరిచిత స్త్రీని కూడా గౌరవంగా చూసే నాయకత్వానికి తన ఓటు పడిందని వివరించారు. సానుకూల, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఎన్నికల ప్రక్రియ ఓ మంచి మార్గం అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications