వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్ సేవక్ పోస్టులు: గ్రామీణ్ తెలంగాణ పోస్టల్ రిక్రూట్‌మెంట్

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. కేవలం పదోతరగతి పరీక్షలో వచ్చిన మార్కుల శాతంతో ఈ మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.

|
Google Oneindia TeluguNews

గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పోస్టల్ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 19, 2017దాకా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్
సంస్థ: తెలంగాణ పోస్టల్ సర్కిల్
పోస్టింగ్: తెలంగాణ
చివరి తేదీ: ఏప్రిల్ 19, 2017
మొత్తం పోస్టులు: 645

పే స్కేల్: రూ.10వేలు/ఒక నెలకు
వయస్సు: అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారై ఉండాలి. ఓబీసీలకు 3ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, వికలాంగ అభ్యర్థులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.

అర్హతలు: రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా సంస్థల నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి ఎటువంటి అదనపు మార్కులు ఇవ్వరు. పదోతరగతి మొదటిసారి ఉత్తీర్ణులైనవారిని, కంపార్ట్‌మెంట్‌లో పాసైన వారికంటే మెరిట్ అభ్యర్థులుగా పరిగణిస్తారు.

Telangana Postal Circle Recruitment for Gramin Dak Sevaks

కంప్యూటర్ నాలెడ్జ్: గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 60 రోజుల ట్రెయినింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా పదోతరగతి/ఇంటర్, డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్టుగా చదివినవారికి కంప్యూటర్ సర్టిఫికెట్ అవసరం లేదు.
నివాసం: జీడీఎస్ బీపీఎం పోస్టులకు ఎంపికైనవారు నెలలోపుగా ఎంపికైన బ్రాంచీపోస్టాఫీస్ ఉన్న గ్రామం/ప్రాంతంలో నివాసం ఉంటానని ప్రమాణపత్రం ఇవ్వాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. కేవలం పదోతరగతి పరీక్షలో వచ్చిన మార్కుల శాతంతో ఈ మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సమాన మార్కులు కలిగిన వారిని జన్మతేదీ, ఎస్టీ మహిళ, ఎస్సీ మహిళ, ఓబీసీ మహిళ, జనరల్ మహిళ, ఎస్టీ పురుష, ఎస్సీ పురుష, జనరల్ పురుష అభ్యర్థుల ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.

చివరితేదీ: ఏప్రిల్ 19, 2017

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా
దరఖాస్తు రుసుం: ఓసీ/ఓబీసీలు రూ. 100/- హెడ్‌పోస్టాఫీస్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పదోతరగతి సర్టిఫికెట్ జేపీజీని 200 కేబీ (ఏ4 సైజ్ మించకుండా) దాటకుండా అప్‌లోడ్ చేయాలి. అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయాలి. వీటి సైజ్ 200కేబీ మించరాదు. ఫొటో, సంతకం 50 కేబీలోపు (200 x 230 pixels)

English summary
Telangana postal circle released new notification on their official website for the recruitment of total 645 Gramin Dak Sevaks. Job seekers should apply online before 19th April 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X