Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరెంట్ అప్పు తీసుకుంటున్నారు! హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..

సాధారణంగా అవసరానికి డబ్బును అప్పుగా తీసుకుని వడ్డీతో కలిపి చెల్లించడం మనకు తెలుసు. కానీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడు కరెంటును అప్పుగా తీసుకుని, తిరిగి కరెంటునే వడ్డీతో సహా ఇచ్చేలా ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. భారీ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి డిస్కంలు ఎంచుకున్న ఈ మార్గం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమయంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో తెలంగాణలో సాగు పనులు ముమ్మరంగా సాగుతుండటంతో డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ (UPCL) తో మన డిస్కంలు కీలక ఒప్పందం చేసుకున్నాయి.

Telangana Power Discoms Adopt Unique Electricity Loan System to Meet Record 18139 MW Demand Amid Farm Rush
  • అప్పు: ఈ నెలాఖరు వరకు రోజుకు గరిష్టంగా 3,000 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ తీసుకోవచ్చు.
  • వడ్డీ: తీసుకున్న విద్యుత్తుకు అదనంగా 5 శాతం కరెంటును కలిపి తిరిగి చెల్లించాలి.
  • తిరిగి ఇచ్చే సమయం: తెలంగాణలో డిమాండ్ తగ్గే ఏప్రిల్ 20 నుంచి జూలై 10 మధ్య ఈ 'బకాయి'ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇదే తరహాలో మధ్యప్రదేశ్ విద్యుత్ సంస్థతో కూడా రోజుకు 500 మెగావాట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి.

రికార్డు స్థాయిలో డిమాండ్.. బోర్ల వినియోగమే కారణం!

రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు (బోర్లు) ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పంటల సాగుకు నీటి అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం రికార్డులు తిరగరాస్తోంది. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 2,000 మెగావాట్లు ఎక్కువ.

Electricity అప్పు.. తప్పిన ఆర్థిక భారం

బయటి మార్కెట్లో (ఎనర్జీ ఎక్స్ఛేంజ్) విద్యుత్ కొనాలంటే యూనిట్‌కు రూ. 10 వరకు ధర పలుకుతోంది. దీనివల్ల డిస్కంలు రోజుకు సుమారు రూ. 50 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఈ భారీ ఆర్థిక భారం నుంచి బయటపడటానికే 'కరెంటుకు కరెంటు' ఇచ్చే ఈ పద్ధతిని అధికారులు ఎంచుకున్నారు. మన దగ్గర మిగులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు ఇచ్చి, అవసరమైనప్పుడు వడ్డీతో సహా వెనక్కి తీసుకోవడం వల్ల అటు రైతులకు అంతరాయం లేని విద్యుత్ అందుతుంది, ఇటు డిస్కంల ఖజానాపై భారం పడదు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+