తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: DA ఫిక్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారికి 17.651 శాతం కరవుభత్యాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇంధన మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆమోదించారు. 71,387 మంది ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు ఈ పెంపు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ. 9.39 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
TG TRANSCO లో 3,036 మంది ఉద్యోగులు, 3,769 మంది కార్మికులు పని చేస్తోన్నారు. వీరితో పాటు 2,446 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 9,251 మందికి తాజా డీఏ పెంపుతో లబ్ది కలుగుతుంది.

TG GENCO లో 6,913 మంది ఉద్యోగులు, 3,583 మంది కార్మికులు పని చేస్తోన్నారు. వీరితో పాటు 3,579 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 14,075 మందికి ప్రయోజనం కలుగుతుంది.
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (TSPDCL)లో 11,957 మంది ఉద్యోగులు, 8,244 మంది కార్మికులు, 8552 పింఛన్ దారులు ఉన్నారు. మొత్తం 28,753 మందికి లబ్ది కలుగుతుంది.
తెలంగాణ నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (TSNPDCL) 9,728 మంది ఉద్యోగులు, 3,465 మంది కార్మికులు, 6,115 పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 19,308 మందికి పెరిగిన డీఏ లభిస్తుంది. మొత్తం మీద 71,387 మంది సవరించిన DA కింద ప్రయోజనాలను పొందుతారు. దీని ఫలితంగా విద్యుత్ సంస్థలపై రూ. 9.39 కోట్ల అదనపు నెలవారీ ఆర్థిక భారం పడుతుంది.












Click it and Unblock the Notifications