తెలంగాణలో భయానకం: రైళ్లకు గండం- అస్తవ్యస్తం

Heavy rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వర్షాల బారిన పడని జిల్లాలు దాదాపుగా లేవీ రెండు రాష్ట్రాల్లో. అటు హైదరాబాద్, ఇటు అమరావతి రెండు ప్రాంతాలు మునకేశాయి.

ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి 12: 30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ- రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Telangana rains Railway track washed away in Mahabubabad

తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్‌ ప్రభావం తెలంగాణపై ఉంటుందంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిొంది. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం మరింత బలపడిందని, వాయుగుండంగా మారిందని వివరించింది.

ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలకూ భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న భారీ వర్షాల ధాటికి అనేక చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే పట్టాలపై వరద నీళ్లు ప్రవహించాయి. ట్రాక్ మొత్తం చాలావరకు ధ్వంసమైంది. పట్టాల కింద భూమి పలు చోట్ల కోతకు గురైంది.

జిల్లాలోని కేసముద్రం మండలం తాల్లపూసపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ఓవర్ హెడ్ లైన్లు దెబ్బతిన్నాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫలితంగా- ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌ సహా పలు రైళ్లను మహబూబాబాద్‌లో నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+