సర్కార్ దవాఖానల్లో దుస్థితి? ‘ప్రజా పాలన’పై తెలంగాణ రక్షణ సేన ఫైర్!

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా తయారైందని.. అసలు సర్కార్ దవాఖానల్లో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా మండిపడింది. 'ప్రజా పాలన' అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా మీరు అందిస్తున్న పాలన అంటూ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రభుత్వ వైద్య రంగ వైఫల్యానికి అద్ధం పడుతున్నాయని ఆరోపించింది.

ల్యాండ్ మ్యాప్ వివాదం వెనుక అసలేం జరుగుతోంది? కవిత పేరు మిస్సింగ్ వెనుక కథేంటి?
ల్యాండ్ మ్యాప్ వివాదం వెనుక అసలేం జరుగుతోంది? కవిత పేరు మిస్సింగ్ వెనుక కథేంటి?

వరుస ప్రమాదాలు.. భయాందోళనలో రోగులు
ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు పసికందులు మృతి చెందిన విషాద ఘటనను మరువకముందే.. భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ(SNCU) వార్డులో సీలింగ్ పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. సీలింగ్ కూలిన సమయంలో అదృష్టవశాత్తూ వార్డులో చిన్నారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని.. లేకపోతే మరో భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని పేర్కొంది. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత లేమికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేసింది.

Telangana Rakshana Sena Slams Congress Over Government Hospitals State Launches Operation Blue Code

వైద్యానికి వేల కోట్ల నిధులెక్కడ?
వైద్యారోగ్య శాఖకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సర్కార్ ఆస్పత్రులు అధ్వానంగా తయారయ్యాయని విమర్శించింది. దవాఖానల్లో కనీస మందులు అందుబాటులో ఉండటం లేదని, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, రోగుల సంఖ్యకు తగ్గట్లుగా వైద్యులు, బెడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టింది. చివరికి రోగులకు కనీసం బెడ్లు కూడా లభించక, వీల్ చైర్లలో కూర్చోబెట్టే చికిత్స అందించే దౌర్భాగ్య స్థితికి వ్యవస్థ దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 కేటీఆర్ అక్రమాల చిట్టా చెప్పి.. నాతో పెట్టుకోకు అంటూ కవిత తీవ్ర హెచ్చరిక!
కేటీఆర్ అక్రమాల చిట్టా చెప్పి.. నాతో పెట్టుకోకు అంటూ కవిత తీవ్ర హెచ్చరిక!

ఆపరేషన్ బ్లూ కోడ్ తో వైఫల్యాలను ఎండగడుతాం!
కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలన వల్ల నాశనమైన ప్రభుత్వ ఆస్పత్రుల అసలు స్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో బయటపెడతామని తెలంగాణ రక్షణ సేన హెచ్చరించింది. ఇందుకోసం #OperationBlueCode పేరుతో ఓ ప్రత్యేక కార్యచరణను చేపటడుతున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడ ఉన్న లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడతామని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+