దేశంలోనే తెలంగాణ నంబర్ వన్- బిగ్ రివార్డ్..!!
జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) 1.0 కార్యక్రమంలో తెలంగాణ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 5.2 లక్షల జల సంరక్షణ నిర్మాణాలు చేపట్టి తెలంగాణ ఈ ఘనత సాధించింది. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఛత్తీస్‌గఢ్- 4.05, రాజస్థాన్ 3.64 లక్షల జల సంరక్షణ నిర్మాణాలతో రెండు, మూడు స్థానంలో ఉన్నాయి.
ఈ ఏడాది "జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రైన్" ప్రచారంలో భాగంగా అవార్డులను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఈ అవార్డులను ప్రకటించారు. నవంబర్ 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఆధ్వర్యంలో జరిగే 6వ జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఢిల్లీలో ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది.

గత ఏడాది సెప్టెంబర్ లో జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక-ఆధారిత జల నిర్వహణను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికింద.. రాష్ట్రాలు కనీసం 10,000 కృత్రిమ రీఛార్జ్, స్టోరేజీ ట్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు 10,000, పట్టణ స్థానిక సంస్థల్లో 2,000 వరకు ఇటువంటి నిర్మాణ పనులను పూర్తి చేయాలి. ఈ లక్ష్యాన్ని తెలంగాణ అందుకుంది. దేశంలోనే అత్యధికంగా 5.2 లక్షల జల సంరక్షణ నిర్మాణాలను పూర్తి చేసింది.
- నార్త్ జోన్‌లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలోని మీర్జాపూర్- 35,509, వారణాసి- 24,409, జలౌన్- 16,279 తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు జిల్లాలకు రూ. 2 కోట్ల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది. ఈస్ట్ జోన్‌లో ఛత్తీస్‌గఢ్ జిల్లాలు సత్తా చాటాయి. బలోద్- 92,742, రాజ్‌నంద్‌గావ్- 58,967, రాయ్‌పూర్- 36,282 తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- సౌత్ జోన్‌లో తెలంగాణ జిల్లాలు మరోసారి అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. ఆదిలాబాద్- 98,693, నల్గొండ- 84,827, మంచిర్యాల్- 84,549 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- వెస్ట్ జోన్‌లో మధ్యప్రదేశ్‌లోని తూర్పు నిమర్ 1.29 లక్షల నిర్మాణాలతో అగ్రస్థానంలో నిలవగా.. త్రిపురలోని నార్త్ త్రిపుర ఈశాన్య మరియు కొండ ప్రాంతాల విభాగంలో అగ్రగామిగా నిలిచింది.
మొత్తంగా, బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌తో సహా వివిధ రాష్ట్రాల నుంచి 67 జిల్లాలను అవార్డులకు ఎంపిక చేశారు. అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు, జిల్లాలకు కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు నగదు బహుమతులు అందించనుండగా, కేటగిరీ 3 కింద ఉన్న జిల్లాలకు రూ. 25 లక్షలు లభిస్తాయి.
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!











Click it and Unblock the Notifications