అలెర్ట్.. తెలంగాణలో బీటెక్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలోని బీటెక్‌, ఫార్మా మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు అలెర్ట్. ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 19 నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. అలాగే ఆగస్టు 10 వరకు మేనేజ్‌ మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఎప్‌ సెట్, సీసీబీ, జోసా షెడ్యూల్‌‌కు అనుగుణంగా దీనిని రూపొందించారు. అప్లికేషన్లతో పాటు ఇతర వివరాల కోసం అధికార వెబ్‌సైట్‌ https://tgche.ac.in/ ను సంప్రదించాలని ఉన్నత విద్యామండలి తెలిపింది.

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపింది.
బీఈ, బీటెక్‌, ఫార్మా కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో 30 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది.

దరఖాస్తు ఆన్‌ లైన్ ద్వారా లేదా డైరెక్ట్ గా కాలేజీలో సబ్‌మిట్ చేయవచ్చని మార్గదర్శకాల్లో ఉంది. అభ్యర్థులు కళాశాల మేనేజ్‌మెంట్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ లేదా పేమెంట్ గేట్‌ వే ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కళాశాలలకు దరఖాస్తు చేయాలనుకుంటే, ప్రతి కళాశాలకు ప్రత్యేకంగా దరఖాస్తు, రుసుము చెల్లించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది.

Telangana Releases B Tech Pharma Management Quota Admission Schedule for July 19

మరోవైపు ఇంజినీరింగ్ మొదటి దశ సీట్ల కేటాయింపు లిస్టు ఇటీవల విడుదల కానుంది. జూన్ 28న మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 95,256 మంది విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కు హాజరు కాగా.. వీరిలో సుమారు 94 వేల మంది నచ్చిన కాలేజీల్లో సీట్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏ కాలేజీలో సీటు వస్తుందనే ఒత్తిడి విద్యార్థుల్లో ఉంది. ఈ సారి మాక్ అలాట్‌ మెంట్‌ విధానాన్ని ఉన్నత విద్యామండలి తొలిసారిగా ప్రవేశపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+