తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. పట్టణ రాజకీయాల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య ఐదు కోట్లకు చేరువ కావడం గమనార్హంగా మారింది.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పురపాలక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.

మొత్తం ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్ల ఖరారు అత్యంత కీలక దశ కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయి ఎన్నికల సన్నాహకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కాలపరిమితి ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ ఎన్నికలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పట్టణ ఓటర్లు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న పురపాలికల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో 26,80,014 మంది మహిళా ఓటర్లు., 25,62,369 మంది పురుషులు. 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు సంఖ్యలో ముందుండటం ఈసారి ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
కార్పొరేషన్లు,..
ఓటర్ల సంఖ్య పరంగా చూస్తే నిజామాబాద్ కార్పొరేషన్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ మొత్తం 3,48,051 మంది ఓటర్లు నమోదు అయ్యారు. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
మున్సిపాలిటీలు..
మున్సిపాలిటీలలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా, అమరచింత మున్సిపాలిటీలో కేవలం 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉండటం విశేషంగా మారింది. ఇది పట్టణాల పరిమాణం, జనసాంద్రతలో ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తోంది.
మొత్తంగా చూస్తే, తుది ఓటర్ల జాబితా విడుదలతో తెలంగాణలో పట్టణ రాజకీయాలు వేడెక్కనున్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నదానిపై ఇప్పుడు అన్ని పార్టీల కళ్లూ ఎన్నికల సంఘం వైపే నిలిచాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications