తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌, తరలి వస్తున్న ప్రముఖులు - షెడ్యూల్..!!

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ కు గేమ్ ఛేంజర్ గా నిలుస్తోంది. రెండు రోజుల పాటు సాగే ఈ సమ్మిట్ అజెండా ఖరారు చేసారు. అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. రెండు రోజుల సదస్సులో 27 ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 9న ఈ వేదిక నుంచి కీలక డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు.

ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​ ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సమ్మిట్ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ నెల 8 మధ్యాహ్నం ఒంటి గంటకు సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ-సెమీకండక్టర్లు, విద్య ,వైద్యం, పర్యాటకం, సిక్యా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్ తదితరులు వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పాల్గొంటారు.

telangana-rising-global-summit-2025-showcases-the-states-vision-bringing-global-delegates-together

అదే విధంగా రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ, సాఫ్ట్ పవన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చర్చలో పాల్గొంటారు. కాగా, ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యమెంట్​ ను ఆవిష్కరిస్తుంది. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్​లో పొందుపరిచారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యా లు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సమ్మిట్​ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్ ​లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్​ ఫోరమ్​ తలపిం చేలా అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+