బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ.. కొత్త రేట్లు ఇవే
తెలంగాణ రాష్ట్రంలోని యువతకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ల రేట్లను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల బస్ పాస్ లను పెంచింది తెలంగాణ ఆర్టీసీ. బస్ పాస్ ల రేట్లను 20 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. సాధారణ పాస్ లతో పాటు స్టూడెంట్ పాస్ ల ధరలనూ పెంచింది తెలంగాణ ఆర్టీసీ.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్నిరకాల బస్ పాస్ రేట్లను పెంచింది. బస్ పాస్ రేట్లను 20 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్డినరీ పాస్ ధర రూ. 1,150 నుంచి రూ.1,400లకు పెరిగింది. మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ రేటు ధర రూ. 1,300 నుంచి రూ. 1,600 లకు పెరిగింది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్ పాస్ రేట్లను 20 శాతం పెంచింది. పెంచిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. సాధారణ ప్రయాణికులతో పాటు స్టూడెంట్ పాస్ లనూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో ఆర్డినరీ పాస్ ధర రూ. 1,150 నుంచి రూ.1,400లకు పెరిగింది. మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ రేటు ధర రూ. 1,300 నుంచి రూ. 1,600 లకు పెరిగింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోంది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ నుంచి 70 శాతానికి పైగా మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో 105 శాతం ఆక్యుపెన్సీ పెరిగినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. రోజుకు సుమారు 14.70 లక్షల మంది మహిళలు ఉచిత బస్సుల్లో జర్నీ చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications