అర్ధరాత్రి నుంచే ఆగిపోయిన ఆర్టీసీ. ప్రయాణికులకు చుక్కలు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమరశంఖం పూరించారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో, మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన డిపోలన్నీ బస్సులతో నిండిపోగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 41 రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేసిందని, తమ సమస్యల పట్ల మొండివైఖరి ప్రదర్శిస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

జిల్లాల వారీగా సమ్మె తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో 110 బస్సులు డిపోకే పరిమితం కాగా, సుమారు 310 మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. డిపో గేట్ల ముందు బైఠాయించిన కార్మికులు, విధులకు వచ్చే కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్‌లో ఉన్న పే-స్కేల్‌ను అమలు చేయడం, యూనియన్లను పునరుద్ధరించడం వంటి 32 ప్రధాన డిమాండ్ల కోసం వారు పట్టుబడుతున్నారు. అటు పెద్దపల్లిలో 150 బస్సులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 112 బస్సులు నిలిచిపోయాయి.

Telangana RTC Strike Bus Services Stalled as JAC Talks Fail Employees Demand Merger and New Pay Scales Now

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమ్మె ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. నిజామాబాద్-1, 2 తో పాటు బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలకు చెందిన దాదాపు 750 బస్సులు రోడ్డెక్కలేదు. జగిత్యాలలో డిపో ముందు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని విలీనం చేయాలని, మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అద్దె బస్సు డ్రైవర్లను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు నినదిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె సైరన్: మరో 'సకల జనుల సమ్మె'కు సై!
ఆర్టీసీ సమ్మె సైరన్: మరో 'సకల జనుల సమ్మె'కు సై!

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. నిర్మల్ జిల్లాలో ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల రవాణా కోసం 'మహిళా స్పెషల్' బోర్డులతో ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ పరిధిలో 16 విద్యుత్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చారు. రవాణాలో అంతరాయం కలగకుండా డిపోల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

22 నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
22 నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

మరోవైపు, ప్రభుత్వం ఈ సమ్మెపై సానుకూలంగానే ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొన్ని సంఘాలు కావాలనే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నప్పటికీ సమ్మెకు వెళ్లడం సరికాదన్నది ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుండటంతో సామాన్య ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+