TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..
ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరమశివుణి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని జీటీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా 13 తేదీ నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించాలని ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు ప్రచారం జరగడంపై ఆ సంస్థ స్పందించిన సంగతి తెలిసిందే. బస్సు టికెట్ ధరలను పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.రెగ్యులర్ సర్వీస్‌లకు సాధారణ ఛార్జీలే అమల్లో ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ జీవో ప్రకారం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఛార్జీలు పెంచినట్లు వివరించింది.
అరుణాచల దర్శనం.. మహాద్భాగ్యం!!
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) November 6, 2024
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు శుభవార్త!! పరమశివుణి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని #TGSRTC యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయక… pic.twitter.com/gGiUhwMeVB
ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో ఒకే మార్గంలో ప్రయాణికులు ఉంటారని.. తిరుగు ప్రయాణంలో బస్సు ఖాళీగా రావాలి కాబట్టి ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు సవరించినట్లు తెలిపింది. ఉదాహరణకు దీపావళి తర్వాత కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు భారీగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ బస్సులో ప్రయాణికులు నిండుగా వెళ్లింది. తిరిగి కరీంనగర్ వెళ్లేటప్పుడు ప్రయాణికులు లేరు. అందుకు డీజిల్ ఖర్చుల కోసం ఛార్జీలు కాస్త పెంచింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications