భాగ్యనగరంలో గే మ్యారెజ్: ఎనిమిదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన స్వలింగ సంపర్కులు: పెళ్లితో ఒక్కటి
హైదరాబాద్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించదు. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు. సభ్య సమాజం అంగీకరించదు. ఇప్పటిదాకా విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి మన దేశానికీ పాకింది. ప్రేమ పునాదుల మీద నిర్మితమైన చారిత్రాత్మక భాగ్యనగరం దీనికి వేదికైంది. ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలిన పంజాబీ అభయ్ డాంగే, బెంగాలీ సుప్రియో చక్రవర్తి అనే ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్లి పీటలు ఎక్కారు. సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. బెంగాలీ సంప్రదాయంలో వారి వివాహం జరిగింది.
ట్విస్ట్ ఏమిటంటే- ఈ పెళ్లికి వారిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అక్కడే సగం విజయం సాధించారు వాళ్లిద్దరు. అభయ్ డాంగే, సుప్రియో చక్రవర్తి పెళ్లికి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులు హాజరయ్యారు. గ్రాండ్‌గా వారి పెళ్లిని దగ్గరుండి జరిపించారు. 60 మంది ఈ గే వెడ్డింగ్‌కు హాజరయ్యారు. పెళ్లికొడుకులను ఆశీర్వదించారు.

హైదరాబాద్‌లో ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో సుప్రియో చక్రవర్తి లెక్చరర్. అభయ్ డాంగే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. జన్మతః పంజాబీ. ఓ ఈ-కామర్స్ కంపెనీలో డెవలపర్. ఎనిమిది సంవత్సరాల కిందట ప్లానెట్ రోమియో అనే డేటింగ్ యాప్ ద్వారా వారికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ నుంచే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Recommended Video
తొలుత ఎల్జీబీటీక్యూ ప్రతినిధులను సంప్రదించారు. చట్టపరంగా ఏవైనా అడ్డంకులు వస్తాయేమోననే విషయాన్ని తెలుసుకున్నారు. స్వలింగ సంపర్కుల వివాహంపై కాంప్రహెన్సివ్‌గా స్టడీ చేశారు. పెళ్లి తరువాత ఎదురయ్యే సవాళ్లపై పూర్తి అవగాహనను తెచ్చుకున్నారు. శనివారం రాత్రి వికారాబాద్ రోడ్‌లో శంకర్ పల్లి వద్ద గల ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. సోఫియా డేవిడ్ అనే గే.. పెళ్లి పెద్దగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications