మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రానికి రహస్య మిత్రుడిగా భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం నరేంద్ర మోడీపై, బీజేపీపై భగ్గుమన్నారు. ఓ విధంగా హెచ్చరికలు జారీ చేశారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందటం లేదని, అవసరమైతే కేంద్రంలో ప్రత్యామ్నాయం కోసం మరో ఫ్రంట్ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
చదవండి: బాబుతో కమల్‌హాసన్ భేటీ?: మోడీకి 'దక్షిణాది' చెక్, ఆ తర్వాతే గొంతుపెంచిన టీడీపీ అధినేత!
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ కంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై తన తీవ్ర అసంతృప్తిని బయటపెడుతున్నారు. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు అఖిల పక్షం, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రధాని మోడీ నిరాకరించారని డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆరోపించారు.
చదవండి: నరేంద్ర మోడీపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం

బీజేపీ అంటే అగ్గిమీద గుగ్గిలం
అంతకుముందు నుంచే రాజకీయాల్లోకి ఇటీవలే ఆరంగేట్రం చేసిన నటుడు కమల్ హాసన్ కేంద్రంపై భగ్గుమంటున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్లో చొచ్చుకొస్తున్న బీజేపీపై మమతా బెనర్జీ, తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న కమలంపై డీఎంకే వంటి పార్టీలు, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్.. ఇలా వరుసగా కేంద్రంపై ఊగిపోతున్నారు. ఇక, బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ అంటేనే వారు అగ్గిమీద గుగ్గిలం అవుతారు.

కాంగ్రెస్ లేని భారత్ అంటూ బీజేపీ ప్రజాస్వామ్య దండయాత్ర
బీజేపీ, నరేంద్ర మోడీ కాంగ్రెస్ లేని భారత్ అని నినదిస్తున్నారు. అలా చెబుతూ, ఒక్కో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసుకుంటూ వస్తున్నారు. చివరకి శనివారం ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌లలోను విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ డెమోక్రటికల్ దండయాత్ర ప్రాంతీయ పార్టీల్లో గుబులు కలిగిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ లేని భారత్ అని చెబుతున్నప్పటికీ.. తమకూ నష్టం జరుగుతోందని భావిస్తున్నారని అంటున్నారు.

ప్రాంతీయ పార్టీలను ఆలోచనలో పడేసిన గెలుపు
2014 నుంచి మొదలు మొన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు బీజేపీ హవాను చెబుతున్నాయి. ఇది ప్రాంతీయ పార్టీలని ఆలోచనలో పడేసిందని అంటున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు బీజేపీ పట్ల మరీ అప్రమత్తమయ్యాయని అంటున్నారు.

బీజేపీకి దూకుడుకు చెక్ పెట్టే ఆలోచన
అందుకు ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ మొదలు స్టాలిన్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇలా అందరూ కేంద్రంపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీని తమ తమ రాష్ట్రాల్లో.. తద్వారా జాతీయస్థాయిలో ఎదుర్కొనేందుకు కేసీఅర్, చంద్రబాబు, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు ఒక్కటిగా వెళ్లి బీజేపీ దూకుడుకు చెక్ చెప్పాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ప్రభలమైన మార్పు అత్యవసరమని, దేశ ప్రజలు ఆ వైపుగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని, థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తే తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని, ఈ విషయంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని, 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీలు సాధించిందేమీ లేదని, ఇప్పటికే కొందరితో మాట్లాడుతున్నామని, మరో ఫ్రంట్ అవసరమని, దేశ రాజకీయాల్లో మార్పే లక్ష్యంగా వెళ్తామని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి న్యాయం చేయకుంటే ఎన్డీయేను వదులుతామని బాబు హెచ్చరించారు. అఖిలపక్షాన్ని కలిసేందుకు అంగీకరించలేదని, ఎంపీలమంతా రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని స్టాలిన్ హెచ్చరించారు.

బీజేపీపై తిరుగుబాటు
ఇది కాంగ్రెస్, బీజేపీలపై తిరుగుబాటుకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఏమో కానీ బీజేపీ వరుసగా రాష్ట్రాలను గెలుస్తూ ఉంటే ప్రాంతీయ పార్టీల్లో వణుకు పుడుతోందని అంటున్నారు. తమ దాకా రాకముందే, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంతో ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, స్టాలిన్, మమత, నవీన్, ములాయం, లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు.

బీజేపీ దెబ్బకు వణుకు
బీజేపీ దెబ్బకు నిన్నటి వరకు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇతర పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడం, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలు ఒక్కటి కావడం మాత్రమే జరిగాయని, అయినప్పటికీ బీజేపీ దూసుకెళ్తుండటం ప్రాంతీయ పార్టీలు జీర్ణించుకోవడం లేదని, అందుకే జాతీయస్థాయిలో ఒక్కటై చెక్ చెప్పే యోచనలో ఉన్నారని అంటున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications