ముగ్గురు ఎమ్మెల్సీలు అనర్హులుగా ప్రకటన..! బులెటిన్ విడుదల చేసిన తెలంగాణ అసెంబ్లీ ..!!
హైదరాబదద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝుళిపించింది. ముందస్తు ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీల పైన ప్రభుత్వం వేటు వేసింది. కొండా మురళి ముందస్తుగానే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేయగా మిగిలిన ముగ్గురిని అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన రాములు నాయక్, నిజామా బాద్ నుండి ఎన్నికైన ఆర్, భూపతి రెడ్డి తో పాటు, కే యాదవరెడ్డిలను అనర్హులుగా ప్రకటించింది. అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన ఆదేశాలు వెంటనే అమలులోకి రానున్నాయి.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తమకు అదికార టీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వడంలేదని భావించిన కొంతమంది గులాబీ ఎమ్మెల్సీలు పార్టీకి తమ దిక్కార స్వారాన్ని వినిపించారు. అంతే కాకుండా పార్టీ సిద్దాంతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఇతర పార్టీలో చేరిపోయారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వారినుండి వివరణ కోరడం జరిగింది. ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన వివరణ సహేతుకరంగా లేకపోవడంతో వారిపై చర్యలకు ఉపక్రమించింది సభ. కొండ మురళి రాజీనమా చేయడంతో మిగిలిన రాములు నాయక్, భూపతి రెడ్డి, కే. యాదవరెడ్డిల పై శాసన సభ వేటువేసింది. అందుకు సంబందించిన బులెటిన్ ను నేడు విడుదల చేసింది.