తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం: 10వ తరగతి పరీక్ష పేపర్లు 11 కాదు ఆరే
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి పరీక్షల నిర్వహణఫై మరోకీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకు 11 ప్రశ్నా పత్రాలకు ఉండగా వీటిని 6 కుదిస్తూ విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో నెలకొన్ని పరిస్థిల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021-2022 విద్యా సంవత్సరానికి గానూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించనున్నారు.

ఇదిలావుంటే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను పరిగణిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పది పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నాటి పదో పరీక్షలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని మరింతగా తగ్గిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 11 పేపర్‌ల కారణంగా పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతాయి. దీంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారో అవకాశం ఉంటుంది. కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 33,506 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 162 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,67,887కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3930గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 647 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
గత
24
గంటల్లో
తెలంగాణ
రాష్ట్రంలో
214
మంది
కరోనా
నుంచి
కోలుకున్నారు.
దీంతో
ఇప్పటి
వరకు
కరోనా
మహహ్మారి
నుంచి
సురక్షితంగా
బయటపడినవారి
సంఖ్య
6,59,722కి
చేరింది.
ప్రస్తుతం
రాష్ట్రంలో
4235
యాక్టివ్
కేసులున్నాయి.
రాష్ట్రంలో
రికవరీ
రేటు
98.77
శాతంగా
ఉంది.
గత
24
గంటల్లో
నమోదైన
కరోనా
కేసుల
కంటే
రికవరీలు
ఎక్కువగా
ఉండటంతో
యాక్టివ్
కేసుల్లో
స్వల్ప
క్షీణత
నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 09, జీహెచ్ఎంసీలో 55. జగిత్యాలలో 01, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 02, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 10, ఖమ్మంలో 04, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 01, మెదక్‌లో 04, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 10, ములుగులో 00, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 11, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 02, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 11, సంగారెడ్డిలో 05, సిద్దిపేటలో 07, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 01, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 07, యాదాద్రి భువనగిరిలో 00 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కామారెడ్డి, కొమరభీం అసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నిర్మల్, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.