బీ అలెర్ట్.. తెలంగాణలో ఈ 5 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 27 వరకూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కొన్ని చోట్ కొన్నిచోట్ల 30 -40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
అయితే ఈ వర్షాలు ప్రస్తుతం పంటలకు అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. హైదరాబాద్ నగర వాసులు అలెర్ట్ గా ఉండాలని పేర్కొంది. వర్షం సమయంలో విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందరాదని అధికారులు సూచనలు చేశారు.

మరోవైపు ఏపీలోనూ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. విశాఖ,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం,సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. మన్యం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications