తెలంగాణలో స్కూళ్లు తెరిచేది అప్పుడే..10వ తరగతి పరీక్ష పేపర్‌లలో మార్పులు..?
హైదరాబాదు: కరోనావైరస్ నేపథ్యంలో తెలంగాణలో విద్యాశాఖ పలు జాగ్రత్తచర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే 2020-21 విద్యాసంవత్సరానికి గాను జరిగే ఎస్ఎస్‌సీ పరీక్షల్లో పేపర్ కౌంట్‌ను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉంటుండగా దాన్ని 6 పేపర్లకు తగ్గించాలని భావిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇవే అంశాలతో విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
Recommended Video


వచ్చే నెల నుంచి స్కూళ్లు
వచ్చే నెల నుంచి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. జనవరి మొదటి వారంలో కానీ సంక్రాంతి తర్వాత కానీ స్కూళ్లను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది. స్కూళ్లతో పాటు ఇతర విద్యాసంస్థలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే 9వ తరగతి నుంచి విద్యార్థులు క్లాసులకు హాజరవుతారని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది.

11 నుంచి 6 పేపర్లకు తగ్గించే యోచన
ఇక 2021లో 5 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతారని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు ఇదివరకటిలా కాకుండా 6 పేపర్లు మాత్రమే రాసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయితే పరీక్ష సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదనే సంకేతాలు ఇచ్చింది విద్యాశాఖ. ఇక రెండు పరీక్షలకు మధ్య ఒకరోజు గ్యాప్ ఇవ్వడం జరుగుతుందని, మ్యాథ్స్ లాంటి కష్టమైన సబ్జెక్టులకు ప్రిపేర్ అయ్యేందుకు రెండు రోజుల సమయం ఇవ్వడం జరుగుతుందని సమాచారం.

నిపుణుల అభిప్రాయం ఏంటి
పరీక్ష పేపర్లను తగ్గించడమంటే సిలబస్‌లో కోత విధిస్తున్నట్లే అని, అదే సమయంలో ప్రశ్నల సంఖ్య, ఛాయిస్‌లను కూడా తగ్గించడం జరుగుతుందని తెలంగాణ విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఒక్కో సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్క హిందీకి తప్ప మిగతా సబ్జెక్టులకు అన్నీ రెండు పేపర్లు ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తోంది విద్యాశాఖ.












Click it and Unblock the Notifications