ఎవరి పాలనలో అన్యాయం జరిగిందో అందరికీ తెలుసు
'తెలంగాణ ప్రజలు బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారంటే ఆ ఘనత తెలుగు దేశం పార్టీదని చంద్రబాబు అన్నారు.
బియ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారని, ధమ్ కా బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో నిరంజన్ రెడ్డి చెప్పాలన్నారు. ఎవరి పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు పంపిణీ చేయడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితేనే BRS ఎందుకు భయపడుతోందన్నారు. మార్చి 29న హైదరాబాద్ లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవ భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నామన్నారు. దీని తర్వాత నిజామాబాద్ తదితర జిల్లాలపై దృష్టి సారించామన్నారు.
'తెలంగాణ ప్రజలు బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారంటే ఆ ఘనత తెలుగు దేశం పార్టీదని, టీడీపీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు తినేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ వచ్చాక మొట్టమొదటిసారి బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారన్నారు. తెలంగాణలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం ప్రారభం సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులకు కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో పెసలు, అల్లం, పసుపు, వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, ఉల్లి, చెరుకు పంటలు పండించారని చెప్పారు. 15వ శతాబ్దం నాటికి బియ్యంతో చేసే హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రసిద్ధి చెందిందని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి, అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. భారతదేశంలోనే తొలి వరి అన్నం తిన్న ప్రజలు తెలంగాణ ప్రజలు అని తెలిపారు.












Click it and Unblock the Notifications