విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఉపాధ్యాయురాలు, వీడియో తీశారు
నర్మెట్ట: జనగామ జిల్లాలోని నర్మెట్ట మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.. విద్యార్థినితో జడ వేయించుకొని, మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
కొందరు విద్యార్థులు ఈ దృశ్యాలను వీడియో తీసి వాట్సాప్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సదరు ఉపాధ్యాయులురాలి నుంచి వివరణ కోరి, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు.

క్లాస్ టైంలోనే ఫిజిక్స్ టీచర్ విద్యార్థినితో జడ వేయించుకుంది. దీనిని తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడియో తీశారు. వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్ పేరు పార్వతి.
ఆమె విద్యార్థినితో తలకు నూనె రాయించుకొని, మసాజ్ చేయించుకున్నారు. ఈ వీడియోను పోస్టు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిని తొలగించి, సరైన ఫిజిక్స్ ఉపాధ్యాయురాలిని అపాయింటుమెంట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ వీడియోపై జిల్లా విద్యాధికారి స్పందించారు. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications