telangana rains: రాబోయే మూడు రోజులు వర్షాలు -దిశ మార్చుకున్న అల్పపీడం, ఏపీలో ఇలా
తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ లోని భారత వాతావరణ విభాగం శుక్రవారం నాడు తాజా అప్ డేట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ పేర్కొంది.
విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా 3.1 ఎత్తున ఆవరించి ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో..

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తాయని, శనివారం ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.
వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 40,593 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 47,436 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 588.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను...ప్రస్తుతం నీటి నిలువ 308.7614 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు,
ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 20న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా ప్రాంతం, యానం, దక్షిణ కోస్తా ప్రాంతం వెంబడి వర్షాలు స్వల్పంగా పడే అవకాశం ఉందని వివరించారు. ప్రధానంగా పశ్చిమ దిశ నుంచి నైరుతి దిశ నుంచి గాలులు వీస్తుంటాయని అధికారులు చెప్పారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం ఉత్తర కోస్తా వైపు ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఈనెల 21 నాటికి అది మరింత బలపడనుంది. దీని ఫలితంగా 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.












Click it and Unblock the Notifications