మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం.. దేశంలోనే ఏకైక మంత్రిగా..

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ వేదికపై ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగే 'ఆస్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 2025' అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంపై ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.

తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగే ఆస్ బయోటెక్ అంతర్జాతీయ సదస్సు-2025 లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కౌన్సులేట్ జనరల్ హిల్లెరీ మెగిచీ ఆహ్వానం పలికారు. సదస్సులో భాగంగా తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ రంగంపై ఆయన మాట్లాడనున్నారు. లైఫ్ సైన్సెస్ ప్రాముఖ్యతను వివరించనున్నారు. దేశంలో ఈ గౌరవం దక్కిన తొలి మంత్రిగా శ్రీధర్ బాబు నిలిచారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో ఈ సదస్సు కీలకంగా మారనుంది.

Telangana Triumph Down Under Minister Sridhar Babu to Keynote AusBiotech 2025 in Melbourne

మరోవైపు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య కీలక పోరు నెలకొంది. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. జూబ్లీహిల్స్‌లో తమ గెలుపు అప్పుడే ఖారారైందన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఓట్ చోరీ కి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+