కేంద్ర బడ్జెట్: హైదరాబాద్‌లో ఐఐటికి రూ.75 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణకు ఆశించిన కేటాయింపులు రాలేదు.
హైదరాబాద్ ఐఐటీకి రూ.75 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది.

దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్‌లోని అమరకంఠక్‌లో ఉండగా, ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ రెండోదిగా రికార్డులకెక్కనుంది.












Click it and Unblock the Notifications