బిగ్ రిలీఫ్.. తీరం దాటిన అల్పపీడనం.. కానీ !!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మరి ముఖ్యంగా తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ( సెప్టెంబర్ 28, 2025 ) ఉదయం ఒడిశాలోని గోపాల్‌పుర్ వద్ద తీరం దాటింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. ఆ ప్రభావం దేశంలోని తూర్పు, దక్షిణ రాష్ట్రాలపై విస్తృతంగా కనిపిస్తోందని ప్రకటించారు.

ఉపరితల ద్రోణి ప్రభావం..

వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తృత వర్షపాతం ఉండబోతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

telangana-weather-update-on-heavy-rains-for-upcoming-two-days

తెలంగాణలో వర్షాల అంచనా..

ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నేడు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

వర్షపాతం గణాంకాలు..

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 15.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డ్ అయింది. వాతావరణ శాఖ ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. వర్షాల సమయంలో నీటిమునిగిన రహదారుల మీదుగా ప్రయాణించరాదని, విద్యుత్‌ స్తంభాలు, చెట్ల క్రింద ఉండకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా నదులు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపింది.

హైదరాబాద్‌లో మూసీ నది మహోగ్రరూపం..

మరోవైపు మూసీ నది గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా రావడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ పరిసరాల్లోని మలక్‌పేట్ నియోజకవర్గంలో 10 కాలనీలు, అంబర్‌పేట్‌లో మరో రెండు కాలనీలు నీట మునిగాయి. దాదాపు 2వేల ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఎంజీబీఎస్ వద్దనున్న రెండు వంతెనలు, నార్సింగిలోని మంచిరేవుల కాజ్‌వే, చాదర్‌ఘాట్ లో లెవల్, మూసారంబాగ్, గౌరెల్లి వద్ద వంతెనలపై నుంచి నీరు ప్రవహించడంతో రోడ్డు రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది.

నగర ట్రాఫిక్‌పై ప్రభావం..

కాగా వంతెనలు, కాజ్‌వేలు మూసివేయబడటంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుంది. వందలాది వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ట్రాఫిక్‌ రద్దీ తీవ్రస్థాయిలో పెరిగింది. పలు ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+